Home  »  TV News  »  ఎవరికీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదా ? జర్నలిస్ట్ పై గెటప్ శీను ఫైర్

Updated : Aug 30, 2022

జబర్దస్త్ షో ద్వారా.. ఆ స్టేజి మీదే ఓనమాలు దిద్దిన ఎంతో మంది ఇప్పుడు   సెలబ్రిటీలుగా ఎదిగారు.  వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్‌ ఈవెంట్స్‌, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు  వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో 3 రిలీజ్ అయ్యింది.  తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్‌ రోషన్‌ సందడి చేశారు.  ఈ షో లో రోషన్ జబర్దస్త్ కమెడియన్స్ ని ఇంటర్వ్యూ  చేశారు. కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా రోషన్ వాళ్ళను అడిగాడు వాళ్ళు కూడా అతన్ని ప్రశ్నించారు. "జబర్దస్త్ లో అసలు ఏం జరుగుతోంది అనేసరికి అది మాకంటే మీకే బాగా తెలుసు" అంటూ ఆది పంచ్ వేసాడు. "మీరు ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కావడానికి కారణం అని రోషన్ అడిగేసరికి నా పక్క ఆర్టిస్టులు సరిగా చేయక నాకు పేరొచ్చింది" అంటారు కృష్ణ భగవాన్.

"మనిషిగా  ఎదగాలంటే దానికి మీరు చెప్పే సూత్రం ఏమిటి అని అడిగేసరికి ఎవడికి బడితే వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని" చెప్పేసరికి..ఇదంతా  సీరియస్ గా గమనిస్తున్న గెటప్ శీను వచ్చి " ఏజ్ పరంగా మీరు ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడతారు ? అనేసరికి రోషన్ ఫేస్ మాడిపోతుంది. మీడియాలో ఉన్న జర్నలిస్ట్ గా ఉన్నాను  కాబట్టి ప్రతీ సారి గారు, గారు అనలేం కదా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇది షో అని శీను అనేసరికి మీకు షో కావొచ్చు కానీ ఇది నా షో అని చెప్పారు" అంటాడు రోషన్ . ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ సీరియస్ గా తారాస్థాయికి చేరింది. ఇంతకు ఎవరు ఎలాంటి పంచ్ డైలాగ్స్ వేసుకున్నారు అనే విషయం తెలియాలంటే ఈ షో చూసేయాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.